500 ట్విట్టర్ ఖాతాల స్తంభన

500 ట్విట్టర్ ఖాతాల స్తంభన

న్యూ ఢిల్లీ: కేంద్రం ఆదేశాల మేరకు 500కుపైగా ఖాతాలను భారత్లో నిలిపివేసినట్లు ట్విట్టర్ ప్రకటించింది. అయితే సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, మీడియా సంస్థలకు సంబంధించిన ఖాతాలను మాత్రం బ్లాక్ చేయలేదని స్పష్టం చేసింది. అలా చేస్తే చట్టాలు వారికి కల్పించిన హక్కులను ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొంది. వినియోగదార్ల భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు పరిరక్షణకు కృషి చేస్తామని స్పష్టం చేసింది. ఇందుకోసం భారతీయ చట్టాల్లో ఉన్న అవకాశాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడిం చిం ది. రైతుల నిరసనలపై దుష్ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై 1,178 ఖాతాలను తొలగించాలని ఇటీవల ట్విట్టర్ను కేంద్రం ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos