విశాఖపట్నం: విశాఖ ఔటర్ హార్బర్లో పడవల్ని లాక్కెళ్లే పడవ ( టగ్)లో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఔటర్ రేవులో కట్టడం పనుల కోసం ఇరవై మంది కార్మికుల్నితీసు కెళ్తున్న పడవలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. వీరిలో ఐదు గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సముద్రంలో దూకిన వారిని తీర ప్రాంత భద్రతా దళం రక్షించారు. మంటల్లో చిక్కకుకున్న పడవ చాలా వరకు తగలబడినట్లు తెలిసింది.