కడలూర్: వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఎఎంఎంకే) నేత దినకరన్ ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూటమిని వీడిన కొద్ది వారాలకే దినకరన్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. కడలూర్‌లో దినకరన్ విలేకరులతో మాట్లాడుతూ ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామిపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ద్రోహాన్ని తన పార్టీ భరించలేదని తెలిపారు. కూటమిలో పెరుగుతున్న విభేదాలను పరిష్కరించడంలో బీజేపీ కేంద్ర నాయకత్వం విఫలమైందని చెప్పారు.