అమరావతి: తితిదే పాలక మండలిలోని 29 మంది సభ్యులతో పాలన సాగించేందుకు కార్యనిర్వహణాధికారి పడే పడే యాతన వర్ణనాతీతమని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గురువారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. భక్తులే పాలక మండలిలో ఉండాలి. అయితే అది ఏ నాడూ జరగలేదు. భవిష్యత్తులో జరుగుతుందన్న ఆశ కూడా లేదు. రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రజా ప్రయోజన వ్యాజ్యంతోనైనా దేవాలయాలకు ప్రభుత్వం నుంచి విముక్తి కల్పించాలి. తితిదే నిర్ణయాలు కార్యనిర్వహణాధికారి, చైర్మన్, ముఖ్యమంత్రి మధ్య జరుగుతాయి. పాలక మండలి సభ్యులు దర్శనాలకు మాత్రమే పరిమితమవుతారు. తాను కార్యనర్వహణాధికారిగా ఉన్నపుడు 14 మంది సభ్యులు పాలక మండలిని నిర్వహించటమే పెద్ద సమస్యగా మారిందన్నారు.