తిరుమల: భక్తుల రద్దీ నియంత్రణకు తితిదే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. దీని వల్ల రద్దీ ఉన్నాసరే శ్రీవారిని దర్వన సమయం ర్శించుకునే సమయం తగ్గనుంది. సార్వత్రిక ఎన్నికల మార్గదర్శకాల కారణంగా మార్చిలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీకి అనుమతించాలని టీటీడీ చేసిన అభ్యర్థనపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. మంగళవారం నుంచి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను అనుమతిస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యులకు గతంలో తరహాలోనే రోజుకు పది వీఐపీ బ్రేక్, పది రూ. 300 ఎస్ఈడీ, ఎంపీలకు 12, ఎమ్మెల్యేలకు ఆరు చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను సిఫార్సు లేఖలను జారీ చేస్తున్నారు.