తిరుమల : ఉగాది పర్వదినం నుంచి శ్రీవారి నిత్య ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని తితిదే ప్రకటించింది. శుక్ర వారం జరిగిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో జవహర్ రెడ్డి ఈ మేరకు ప్రకటిం చారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు 72 గంటల ముందు కరోనా పరీ క్షల్ని చేయించుకోవాలి. రోగం లేదనే నిర్ధారణ పత్రాల్ని చూపించాలి. ఏప్రిల్ 15 తరువాత వయోవృద్ధులు, చిన్న పిల్లలకు దర్శనాలను ప్రారంభించదలచినట్లు వెల్లడించారు. దాతలు సూచించిన వారి కుటుంబీ కులు, మిత్రులకు దర్శనాలనూ ఆరంభిస్తామని వివరించారు. ఉచిత దర్శనం టోకెన్ల కోటాను దశలవారీగా రోజుకు 40 వేలకు పెంచనుననట్లు తెలిపారు. ఈ నెల 24 నుంచి 28 వరకూ శ్రీవారి తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు.