హైదరాబాదు: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం తీర్చేంత వరకూ సమ్మె కొనసాగుతుందని వామపక్షాల నేతలు గురువారం ఇక్కడ ప్రకటించారు. ఐక్య కార్యచరణ సమితి(ఐకాస) చేపట్టనున్న బంద్కు మద్దతుగా ఇక్కడి ఇందిరాపార్క్ వద్ద వామ పక్షాలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టాయి. ప్రజా సంఘాల నాయకులు, ఇతర నేతలు దీక్షకు ఈ ఆందోళనకు సంఘీ భావాన్ని ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికు లకు నివాళులర్పించారు. సీపీఐ, సీపీఎంతోపాటు ప్రజా సంఘాల నేతలు ప్రభుత్వ మొండి వైఖరిని విమర్శించారు. లాభాలు వచ్చే మార్గాల్లోనే ప్రైవే టు బస్సుల్ని, నష్టాలు వచ్చే బాటల్లో ఆర్టీసీ బస్సులు తిప్పు తున్నారని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి చాడ వెంకటరెడ్డి, ఆచార్య నాగేశ్వర్, విద్యా వేత్త చుక్కా రామయ్య దీక్షకు మద్దతు ప్రకటించారు. ‘ కార్మికుల సమ్మె జీతాల కోసం కాదని, ఆర్టీసీ పరిరక్షణ కోసం. కార్మికుల వల్లే ఆర్టీసీకి నష్టమంటూ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. ఆర్టీసీకి పట్టణ రవాణాలోనే ఏటా రూ.720 కోట్ల నష్టం వస్తోంది. మూడు వేల అద్దె బస్సులు పెంచితే ఆర్టీసీ నిండా మునుగుతుంద’ని ఆచార్య నాగేశ్వర్ పేర్కొన్నారు.