నోబెల్‌ శాంతి పురస్కారానికి ట్రంప్‌ను నామినేట్‌ చేసిన పాక్‌ ప్రభుత్వం

నోబెల్‌ శాంతి పురస్కారానికి ట్రంప్‌ను నామినేట్‌ చేసిన పాక్‌ ప్రభుత్వం

ఇస్లామాబాద్‌:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మరోసారి ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి పురస్కారానికి నామినేట్‌ అయ్యారు. పాకిస్థాన్ ప్రభుత్వం ట్రంప్‌ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవలే తలెత్తిన ఘర్షణల సమయంలో ట్రంప్ దౌత్యపరంగా జోక్యం చేసుకుని కీలకంగా వ్యవహరించారని, ఆయన నాయకత్వానికి గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్థాన్ ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ట్రంప్‌పై ప్రశంసలు కురిపించింది. ట్రంప్‌ను నిజమైన శాంతి నిర్మాతగా అభివర్ణించింది. కాగా, ట్రంప్‌ ఇప్పటికే పలుమార్లు ఈ విశిష్ట పురస్కారానికి నామినేట్‌ అయినప్పటికీ ఒక్కసారి కూడా బహుమతిని గెలుచుకోలేక పోయారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos