కేఏ పాల్‌పై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడి

కేఏ పాల్‌పై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడి

సిద్ధిపేట జిల్లా: జక్కాపూర్‌లో కేఏ పాల్‌పై దాడి జరిగింది. వర్షాలతో నష్టపోయిన రైతుల్ని పరామర్శించడానికి సిరిసిల్ల జిల్లా వెళ్తున్న పాల్‌ను టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. డీఎస్పీ ముందే కేఏ పాల్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పాల్ వస్తున్నారనే సమాచారంతో సిరిసిల్లా జిల్లా సరిహద్దులకు చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు.. ఆయనను అడ్డుకుని బూతులు తిడుతూ దాడికి దిగారు.
పోలీసుల తీరుపై కేఏ పాల్ ఆగ్రహం
టీఆర్ఎస్ నేతలు గూండాల్లా వ్యవహరించారని, పోలీసుల సమక్షంలోనే తనపై దాడి జరిగిందని.. దీనికి పోలీసులే బాధ్యత వహించాలంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos