మంత్రివర్గ కూర్పుపై రగులుతున్న అసహనం…

మంత్రివర్గ కూర్పుపై రగులుతున్న అసహనం…

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై పార్టీలో అసమ్మతి రగులుతున్నట్లు
తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.పార్టీలో
సీనియర్‌ నేతలు,ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషిచిన నేతలను కాదని ఇతర పార్టీల నుంచి
వచ్చిన నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టారంటూ నేతల్లో అసహనం వ్యక్తమవుతున్నట్లు సమాచారం.మంత్రి వర్గ విస్తరణపై బహిరంగంగా ఎవరు పెదవి విప్పకపోయిన లోలోపల మాత్రం అగ్ని పర్వతం బద్దలయ్యేలా ఉంది. అయితే తమ అసంత్రుప్తిని – అసమ్మతిని వెల్లడించేందుకు మాత్రం ఏఒక్కరూ సిద్దంగా లేరు. తమ అననాయులు – అనుచరుల వద్ద తమ అసహనాన్ని
బహిర్గతం చేసుకుంటున్నారే తప్ప బహిరంగంగా మాట్లేందుకు సైతం ఎవరూ ముందుకు రావడం లేదు. ముఖ్యంగా పార్టీలో సీనియర్ నాయకుడు భారీ మేజారిటీతో గెలిచిన తన్నీరు హరీష్ రావుకు మంత్రి పదవి దక్కకపోవడంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తెలంగాణ
ఉద్యమం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు హరీశ్‌రావు ఎంతోకీలక పాత్ర పోషించారని
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో తెరాస అధికారంలోకి
రావడానికి కూడా హరీశ్‌రావ్‌ కీలకపాత్ర పోషించారని అటువంటిది మంత్రివర్గంలో హరీశ్‌రావుకు
స్థానం కల్పించకపోవడం దారుణమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచిన 88 స్దానాలలో 30 స్థానాలు
లు హరీష్ రావు వల్లే దక్కాయని. ముఖ్యంగా కోడంగల్ నియోజకవర్గంలో బలమైన రేవంత్‌రెడ్డిపై విజయం సాధించడం వెనుక హరీష్ రావు మంత్రాంగమే కారణమని
నేతలు అంటున్నారని తెలుస్తోంది. తన కుమారుడిని అందలం ఎక్కించేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు హరీష్ రావును బలిపశువును చేసారని  పార్టీలో చర్చ జరుగుతున్నాయని
సమాచారం.ఈ ఎన్నికలలో మహిళల ఓట్లతోనే గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆ మహిళలకు మంత్రి వర్గంలో స్దానం కల్పించకపోవడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ తొలి క్యాబినెట్ విస్తరణ పార్టీలో అసంతృప్తికి
బీజం వేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..

పార్టీకోసం సైనికుడిలా పని చేస్తా…

తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై వస్తున్న కథనాలు,వార్తలను హరీశ్‌రావు
ఖండించారు.టీఆర్ఎస్ పార్టీలో తాను క్రమశిక్షణ గల సైనికుడినని స్పష్టంచేశారు హరీశ్ రావు.
మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, జిల్లాలు, వివిధ అంశాల ప్రాతిపదికన తీసుకొని
చేపట్టారని గుర్తుచేశారు. ఈ సారి కొత్తగా ఆరుగురికి చోటు దక్కడం … వివిధ అంశాల నేపథ్యంలో
కూర్పు జరిగిందని వివరించారు. కేబినెట్ లో తనకు బెర్త్ దక్కకపోవడంపై ఎలాంటి అసంత్రుప్తి
లేదని చెప్పారు. సోషల్ మీడియాలో తన పేరుతో జరుగుతున్న ప్రచారానికి తెరదించాలని కోరారు.
ఈ ప్రచారంతో తనకు, అనుయాములకు సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారానికి సంబంధం లేదన్నారు.
తనకు ఎలాంటి సేనలు, గ్రూపులు లేవని తేల్చిచెప్పారు.

ఏ పని అప్పగించినా నిర్వర్తిస్తా … తనకు ఏ పని అప్పగించినా
… నిర్వర్తిస్తానన్నారు హరీశ్ రావు. సీఎం కేసీఆర్ అప్పగించిన పని బాధ్యతాయుతంగా చేపడుతానని
స్పష్టంచేశారు. పార్టీ ఉన్నతి కోసం క్రమశిక్షణ గల సైనికుడిగా పాటుపడుతానని .. అసత్య
ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos