కేసీఆర్‌ ఒక్కడితోనే పరిష్కారం సాధ్యం…

దశాబ్దాలుగా కోర్టులో పెండింగ్‌లో ఉన్న అయోధ్య వివాదం,దేశ సరిహద్దుల్లో
నెలకొన్న ఉగ్రవాదం,ఉద్రిక్త సమస్యలకు పరిష్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌
వల్ల మాత్రమే సాధ్యమవుతుందంటూ తెరాస ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ వ్యాఖ్యానించారు.తెలంగాణ భవన్లో టీఆర్ ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. పుల్వామాలో
జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి అంతకు రెండింతల స్థాయిలో ధీటుగా జవాబిచ్చిన భారత వాయుసేనను
అభినందిస్తున్నామన్నారు.కశ్మీర్‌ సమస్య రావణకాష్టంలా రగులుతూనే ఉండడానికి ప్రధాన కారణం
దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూయేనని ఆరోపించారు.నెహ్రూ అనుసరించిన విధానాల
వల్లే కశ్మీర్‌లో ప్రతీరోజూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు.కశ్మీర్‌కు తెలంగాణ
రాష్ట్రానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయన్నారు.సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సమర్థత వల్ల
తెలంగాణ భారత ప్రభుత్వంలో విలీనమైందని లేదంటనే నెహ్రూ అసమర్థత విధానాల వల్ల తెలంగాణ
కూడా కశ్మీర్‌ ఎదుర్కొంటున్న పరిస్థితులనే ఎదుర్కోవాల్సి వచ్చేదన్నారు.`కశ్మీరు సమస్యకు శాశ్వత పరిష్కారం కేసీఆర్ లాంటి విజనరీ వల్లే సాధ్యమవుతుంది. అయోధ్య సమస్యకు పరిష్కారం కూడా కేసీఆర్ లాంటి నాయకుడి వల్లే సాధ్యమవుతుంది. కేసీఆర్ పంచసిద్ధుడు. సిద్దులకుండే గొప్ప లక్షణాలు కేసీఆర్ కు ఉన్నాయి. …కాశ్మీర్ సమస్య శాశ్వత పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు టీఆర్ ఎస్ మద్దతునిస్తుంది“ అని వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos