ఎన్నికల ప్రచారాల్లో
నోరు జారడం తెరాస నేతలకు అలవాటుగా మారినట్లు కనిపిస్తోంది.గతంలో ఎన్నికల ప్రచారాల్లో
కారుకు బదులు సైకిల్‌కు ఓటు వేయాలంటూ అభ్యర్థించి కొంతమంది పార్టీ ఫిరాయించిన నేతలు
నాలుక కరుచుకోగా తాజాగా టీఆర్ఎస్ మహిళా నేత ఉమా మాధవరెడ్డి అటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రాదేశిక ఎన్నికల్లో బొమ్మలరామారం జెడ్సీటీసీ అభ్యర్థిగా ఉమా కుమారుడు ఎలిమినేటి సందీప్‌రెడ్డి టీఆర్‌ఎస్ నుంచి పోటీచేస్తున్నాడు. దీంతో తనయుడి తరపున ప్రచారం నిర్వహించిన ఉమా ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు
ఓట్లు వేయాలంటూ అభ్యర్థించారు.పక్కనే ఉన్న సందీప్‌రెడ్డి, ఇతర టీఆర్‌ఎస్ నాయకులు కారు గుర్తు అని సూచించడంతో తేరుకున్న ఉమ.. కారు గుర్తుకు ఓటేసి సందీప్‌రెడ్డిని భారీ మెజారితో గెలిపించాలని కోరారు. కాగా, తెలుగుదేశం పార్టీని వీడి గులాబీ గూటికి చేరినా ఉమా మాధవరెడ్డి పాత పార్టీని మరచిపోనట్టున్నారని కొందరు సెటైర్లు వేస్తున్నారు.గతంలో ఖమ్మం లోక్‌సభ ఎన్నికల ప్రచారాల్లో తెరాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు
కూడా సైకిల్ గుర్తుకే ఓటు వేయాలంటూ అభ్యర్థించి నాలుక కరుచుకున్న విషయం తెలిసిందే..