తెరాస నేతకు రూ.25వేల జరిమానా..

తెరాస నేతకు రూ.25వేల జరిమానా..

హైదరాబాద్‌ నగరాన్ని అందంగా తీర్చిదిద్దే క్రమంలో నిబంధనలు అతిక్రమించే వ్యక్తులు అధికార పార్టీ నేతలైనా ఉపేక్షేంది లేదంటూ జీహెచ్‌ఎంసీ మరోసారి రుజువు చేసుకుంది.తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రిపదవి దక్కించుకున్న తెరాస నేత తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కొద్ది రోజుల క్రితం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను అభినందిస్తూ బాలరాజ్‌ అనే తెరాస నేత హైదరాబాద్‌ నగరంలోని నెక్లెస్‌రోడ్‌ ప్రధాన రహదారిపై ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.హైదరాబాద్‌ నగరాన్ని అందంగా తీర్చిదిద్దే క్రమంలో నగరంలో ప్లెక్సీలు,బ్యానర్లు నిషేధిస్తున్నట్లు కొద్ది కాలం క్రితం జీహెచ్‌ఎంసీ ప్రకటించింది.జీహెచ్‌ఎంసీ నిబంధనలను లెక్కచేయకుండా ప్లెక్సీలు ఏర్పాటు చేసి నిబంధనలు అతిక్రమించినందుకు బాలరాజ్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు రూ.25వేల జరిమానా విధించారు.గతంలో కూడా నిబంధనలు అతిక్రమించిన కార్పోరేటర్లు, శాసనసభ సభ్యులకు కూడా జీహెచ్‌ఎంసీ జరిమానాలు విధించారు.హైదరాబాద్‌ నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నజీహెచ్‌ఎంసీకి అన్ని రాజకీయ పార్టీల నేతలు సహకరించాలంటూ జీహెచ్‌ఎంసీ మేయర్‌ రామ్మోహన్‌ విజ్ఞప్తి చేశారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos