ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ తెలంగాణకు నిరాశాజనకంగానే ఉందని లోక్సభలో తెరాస పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు రాయితీలు ఇవ్వకపోవడం ఆవేదన కలిగించిందన్నారు. కొత్త రాష్ట్రం కనుక కొన్ని రాయితీలు ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. కొన్ని ప్రాజెక్టులైనా రాష్ట్రానికి వస్తాయని ఆశించామని, కానీ నిరాశే మిగిలిందని వాపోయారు. హైదరాబాద్ లాంటి నగరానికి కొంత ప్రాముఖ్యత ఇచ్చి ఉంటే బాగుండేదని తాము అనుకున్నామన్నారు. రాష్ట్రంపై భాజపా కపట ప్రేమకు ఈ బడ్జెట్ నిదర్శనమని మరో తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.