హైదరాబాద్: ఆదేశాలను ధిక్కరించి సమ్మెకు దిగిన కార్మికులకు వ్యతిరేకంగా ఎస్మా ప్రయోగించి విధుల నుంచి తొలగిస్తామ’ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆర్టీసీ కార్మికులను హెచ్చరించారు. ఆర్టీసీతో విఫలమైన తర్వాత సోమేశ్కుమార్ విలేఖరులతో మాట్లాడారు. ‘కార్మికుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తుంది. అయితే ఇందుకు కొంత వ్యవధి కావాలి. సమ్మెకు దిగితే ప్రత్యామ్నాయంగా అద్దె, ప్రైవేట్ బస్సులు నడిపి దసరా పండుగ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. ఇంకా వాటికి రక్షణ కల్పిస్తాం. ఎక్కువ ఛార్జీలు వసూలు చేయరాదని ప్రయివేటు బస్సుత యాజమాన్యాల్ని సూచించాం. అవసరమైతే పాఠశాల బస్సుల్ని కూడా రంగంలోకి దించుతాం. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించి విధుల నుంచి తొలగిస్తాం. వారి స్థానంలో వీలైనంత త్వరగా కొత్తవారిని నియమిస్తాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి ప్రభుత్వం రూ.3,003 కోట్ల సాయాన్ని చేసింది. గత మూడేళ్లుగా బడ్జెట్లో కేటాయించిన దాని కంటే ఎక్కువ నిధులు ఆర్టీసీకి ఇచ్చామ’ని విపులీకరించారు