హోలీ తర్వాత సీట్ల పంపకం

పాట్నా:కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి మధ్య సీట్ల సర్దు బాటు గురించి హోలీ పండుగ తర్వాత ప్రకటిస్తామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బుధవారం ఇక్కడ తెలిపారు. సీట్ల పంపకం గురించి విభేదాలు తలెత్తినట్లు వస్తున్న ఊహాగానాలకు తెర దించారు. మహాకూటమి సభ్యుల్లో ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనే దాని గురించి ఈ నెల 22 న నిర్వహించనున్న మాధ్యమ ప్రతినిధుల సమావేశంలో ప్రకటిస్తామని లోక్ జనశక్తి పార్టీ నేత శరద్ యాదవ్ తెలిపారు.‘ సీట్ల పంపకాల వ్యవహారం దాదాపు ఖరారైందని, కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు పూర్తి స్థాయి చర్చలు జరుపుతున్నారని, ఒకవేళ తన సహాయం కోరితే మధ్యవర్తిత్వానికి సిద్ధమేనని చెప్పారు. కాంగ్రెస్కు ఎనిమిది కంటే ఎక్కువ సీట్లు ఇవ్వలేమని ఆర్జేడీ చెబుతుండగా, కాంగ్రెస్ పార్టీ 11 సీట్ల కోసం పట్టుబడుతోంది. మహాకూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, ఆర్ఎల్ఎస్పీ, హిందుస్థాన్ అవామీ మేర్చా, లోక్ జన్ తాంత్రిక్ దళ్ (ఎల్జేడీ), వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) భాగస్వాములుగా ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos