షోపియాన్ : రెబన్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య సోమవారం సంభవించిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. సోమవారం ఉదయం షోపియాన్ జిల్లా రెబన్ ప్రాంతంలో తల దాచుచకున్న ఉగ్రవాదుల కోసం సీఆర్పీఎఫ్, పోలీసులు గాలించారు. అప్పు డు ఉగ్ర వాదులు కాల్పులకు తెగ బడ్డారు. ఆత్మ రక్షణకు పోలీసులు ఎదురు కాల్పులకుదిగారు. ఒక ఉగ్రవాది అక్కడికక్కడే హతమయ్యా డు. ఇతర ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు గాలిస్తున్నాయి.