న్యూఢిల్లీ : రైలు చార్జీలు వారం, పది రోజుల్లో భారీగా పెరగనున్నాయి. కి.మీకు 5 నుంచి 40 పైసల వరకూ పెంపు ఉండనుంది. రైలు చా ర్జీల పెంపు ప్రతిపాదనకు గత నెల్లోనే ప్రధాని మోదీ ఆమోదించారు. అయితే జార్ఖండ్ శాసనసభ ఎన్నికల కారణంగా వాటి అమలును వాయిదా వేసారు. ఎన్నికలు ముగిసినందున ఛార్జీల మోత మోగించేందుకు రంగాన్ని సిద్ధం చేస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి.ఆర్థిక మందగ మనం రైల్వేల ఆర్థిక వనరుల ఒత్తిడిని అధికంచేసింది. రోడ్డు రవాణా నుంచి దీటైన పోటీ ఎదురు కావటంతో సరుకు రవాణా చార్జీలను పెంచలేని నిస్సహాయత ఏర్పడింది. గత రెండేళ్లుగా ప్రయాణీకుల చార్జీలను నేరుగా పెంచకపోవడంతో తాజాగా చార్జీల పెంపునకే మొగ్గుచూపారు.