ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మహా అయితే ఒక కిలోమీటర్ కాకపోతే రెండు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక పండుగల సమయంలో ఊర్లకి వెళ్ళేటప్పుడు టోల్ గేట్స్ వద్ద ఇంకొంచెం ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది కూడా సాధారణమే. కానీ ఏకంగా 700 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది. ఒక్కసారి ఆలోచించండి .. 700 కిలోమీటర్లు వాహనాలు అలా నిలబడి ఉంటే ఎలా ఉంటుందో. ఈ భారీ ట్రాఫిక్ జామ్ .. కరోనాతో అల్లాడిపోతూ సెకండ్ వేవ్ మొదలైన కారణంగా లాక్ డౌన్ విధించిన ఫ్రాన్స్ లో లో అయింది.ప్రస్తుతం ఫ్రాన్స్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ మొదలైపోయింది. వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోవడంతో సగానికి పైగా ఐసీయూ బెడ్స్ కరోనా రోగులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో డిసెంబరు 1 వరకు లాక్ డౌన్ విధిస్తూ ఫ్రెంచి ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా గురువారం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ముఖ్యంగా పారిస్ సహా ప్రధాన పట్టణాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.లాక్ డౌన్ సమయంలో అత్యావసరాల కోసం మినహా పౌరులు బయటకు రావొద్దని స్పష్టం చేసింది. దీంతో హాలీడే ట్రిప్పుల కోసం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు నిబంధనల నేపథ్యంలో ఇళ్లకు చేరుకునే వారి వాహనాలతో రాజధాని నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 435 మైళ్లు (అంటే 700 కిలోమీటర్ల) మేర రోడ్ల మీద వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. లాక్ డౌన్ నేపథ్యంలో మార్నింగ్ వాక్ ఎక్సర్ సైజ్ కోసం బయటకు వెళ్లే ప్రజలు.. అందుకోసం ఇంటి నుంచి కిలోమీటరు పరిధిలో ఉండే ప్రాంతాలు ఎంచుకోవాలని వైద్య అవసరాలు నిత్యావసరాల కోసం మినహా బయటకు రావొద్దని అధికారులు స్పష్టం చేశారు. రెస్టారెంట్లు కేఫ్ లు మూసివేయాలని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే నెలలపాటు ఇంట్లోనే మగ్గిపోయిన తమకు ఈ లాక్ డౌన్ వల్ల మరోసారి ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి రావడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.