ట్రాక్టర్​ను ఢీకొన్న ట్రక్కు- అక్కడికక్కడే 8 మంది మృతి

ట్రాక్టర్​ను ఢీకొన్న ట్రక్కు- అక్కడికక్కడే 8 మంది మృతి

బులంద్​షహర్ : యాత్రికులను తీసుకెళ్తున్న ట్రాక్టర్​ను ట్రక్కు ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 43 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆర్నియా బైపాస్ సమీపంలోని బులంద్‌షహర్- అలీగఢ్ సరిహద్దులో సోమవారం తెల్లవారు జామున 2.10 గంటల ప్రాంతంలో ట్రాక్టర్​ను ట్రక్కు ఢీకొట్టింది. కస్గంజ్ జిల్లాలోని రఫత్‌పూర్ గ్రామం నుంచి రాజస్థాన్‌లోని జహర్‌పీర్‌కు తీర్థయాత్ర కోసం ప్రయాణిస్తున్న 61 మంది ట్రాక్టర్​లో ఉన్నారు. ఘటనలో అక్కడికక్కడే 8 మంది మరణించారు. 43 మంది గాయపడగా, స్థానికుల సహాయంతో పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు తప్ప మిగతా వారందరి పరిస్థితి బాగానే ఉంది. ఆ ముగ్గురు ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. ట్రాక్టర్‌ను ఘటనాస్థలి నుంచి తొలగించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు పోలీసుల అదుపులో ఉంది అని బులంద్‌షహర్ ఎస్​ఎస్​పీ దినేశ్ కుమార్ సింగ్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos