అలా వసూలు చేసే 23 పెళ్లిళ్లు చేశా..

  • In Film
  • May 14, 2020
  • 166 Views
అలా వసూలు చేసే 23 పెళ్లిళ్లు చేశా..

దక్షిణాది సినీ పరిశ్రమలో హాస్యనటుడిగా ప్రత్యేక గుర్తింపు,స్థానం సంపాదించుకున్న బ్రహ్మానందంపై చాలా విమర్శలే ఉన్నాయి.అందులో ముఖ్యంగా డబ్బుల విషయంలో చాలా కఠినంగా ఉంటారని ఏరోజుకు ఆరోజు పారితోషకం మొహమాటం లేకుండా అప్పుడే వసూలు చేస్తారనే టాక్‌ ఉంది.దీనిపై ఇప్పటివరకు స్పందించని బ్రహ్మీ తాజాగా స్పందించారు.పారితోషకం విషయంలో తనపై వచ్చిన వార్తలు నిజమేనని డబ్బుల విషయంలో చాలా కఠినంగానే ఉంటానని అంగీకరించారు.ప్రస్తుతం ఏరోజు ఎలా ఉంటుందో చెప్పలేమని డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తుల జీవితాలు ఎంత దుర్బరంగా గడిచాయో అందరికీ తెలుసన్నారు.అందుకే పారితోషకం విషయంలో కఠినంగా వ్యవహరిస్తానన్నారు. నేను 100 రూపాయలు సంపాదిస్తే .. అందులో 10 రూపాయలు ఇతరులకి సాయాన్ని అందించడం కోసం కేటాయిస్తాను. అలా ఇంతవరకూ  ఆర్థికపరమైన అండలేని 23 మంది ఆడపిల్లలకు పెళ్లిళ్లు జరిపించాను. చేసిన సాయాలను గురించి నేను చెప్పుకోను .. అందువలన నాపై విమర్శలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయిఅని చెప్పుకొచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos