నిశ్చితార్థంపై షాకిచ్చిన పునర్నవి..

  • In Film
  • October 31, 2020
  • 189 Views
నిశ్చితార్థంపై షాకిచ్చిన పునర్నవి..

ఉయ్యాలా జంపాల సినిమాలో అవికా గోర్ స్నేహితురాలిగా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం తాజాగా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో వార్తల్లో నిలిచింది. తనకు ఉద్భవ్ రఘునందన్‌తో నిశ్చితార్థం అయినట్టు రింగ్ చూపిస్తూ ఇటీవల షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.అలాగే మిగతా విషయాలు రేపు తెలుపుతాను అని పునర్నవి ఆ పోస్టులో పేర్కొన్నప్పటికీ.. ఆమె ఫాలోవర్స్, అభిమానులు మాత్రం పునర్నవి భూపాలంకి నిశ్చితార్థం జరిగిపోయిందని ఫిక్స్ అయిపోయారు.తీరా చూస్తే ఈ రోజు చేసిన పోస్ట్‌లో తాను వెబ్ సీరీస్‌లో నటిస్తున్నాను అని ఆ వెబ్ సీరీస్ పోస్టర్‌ను పోస్ట్ చేసింది.ఇదంతా ఓ వెబ్ చిత్రం పబ్లిసిటీ కోసమేనట. తాజాగా పునర్నవి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో మరింత స్పష్టత వచ్చింది. ఉద్బవ్ రఘునందన్, పునర్నవి ప్రధాన పాత్రలో నటించిన కమిట్మెంట్ అనే వెబ్ చిత్రం ఆహా యాప్‌లో నవంబరు 13న విడుదల కానుంది. దీనిపై పునర్నవి స్పందిస్తూ అంతా తప్పలేక ఒప్పుకున్నానని తెలిపారు.మీరు కూడా వీలుపడితే మాతో జాయిన్ అవ్వండి అని తెలిపారు. మొత్తంమీద తన వెబ్ ఫిల్మ్‌కు పబ్లిసిటీ పెరిగిందన్నారు. ఇందులో రాహుల్ సిప్లిగంజ్ కూడా పాత్ర పోషిస్తున్నాడు. పునర్నవి పెళ్లి, నిశ్చితార్థం అనగానే తనవంతు వైరాగ్యపు పోస్ట్‌తో సీన్‌ను పండించాడని పునర్నవి తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos