సోగ్గాడి ఆస్తుల విలవ ఎంతో తెలుసా!

  • In Film
  • May 12, 2020
  • 171 Views
సోగ్గాడి ఆస్తుల విలవ ఎంతో తెలుసా!

సోగ్గాడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం శోభన్ బాబు. పోటీగా స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా తనదైన శైలిలో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా మహిళల నుంచి అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న నటుల్లో శోభన్ బాబు ఒకరు. ఎలాంటి సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకునేవి. ఎక్కువగా మొదటి వారం ఆడవాళ్లే ఆయన సినిమాలు చూడటానికి వచ్చేవారు.స్టార్ హీరోగా ఎదగడానికి శోభన్ బాబు చాలానే కష్టపడ్డారు. మొదట్లో సీనియర్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. నటనతో మంచి గుర్తింపు అందుకొని తరువాత హీరోగా బిజీ అయ్యారు. కృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు సందడి చేస్తున్న సమయంలో శోభన్ బాబు తనదైన శైలిలో హిట్స్ అందుకునేవారు. ఇక శోభన్ బాబు క్రమశిక్షణలో నిబద్దతతో ఉండేవారు. సమయానికి షూటింగ్ కి వచ్చి తన పని తాను సైలెంట్ గా చేసుకుంటూ వెళ్లేవారు.శోభన్ బాబు సినిమాల ద్వారా సంపాదనను చాలా జాగ్రత్తగా దాచుకునేవారు. ఖర్చులు చేయకుండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మాత్రమే ఇన్వెస్ట్ చేసేవారు. శోభన్ బాబు తనను కలిసిన ప్రతీ ఆర్టిస్టును సంపాదించిన సొమ్మును వడ్డీ వ్యాపారానికో మరో దానికో కాకుండా భూమిపైన పెట్టుబడి పెట్టాలని సూచించేవాడట.. భూమిపై పెట్టిన డబ్బు ఎక్కడికి పోదని చెప్పేవాడట.. ఆయన చెప్పడమే కాదు.. ఏకంగా తన సంపదనంతా భూములపైనే పెట్టాడు.మద్రాస్ లో అలాగే హైదరాబాద్ లో అప్పట్లో చాలా భూములు కొనుగోలు చేశారు. ఎక్కువగా మద్రాస్ లో వేల ఎకరాలు కొన్నారు. 2008లో ఆయన మరణించే సరికి అప్పట్లో వాటి విలువ రూ.80వేల కోట్లు దాటాయి. ఇక ఇప్పుడు లక్షల కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.ఇక శోభన్‌బాబు సలహాతో మురళీ మోహన్ కూడా భారీగా నాడు భూములు హైదరాబాద్ లో కొని ఇప్పుడు వేలకోట్లకు అధిపతి అయ్యాడు. దక్షిణాది హీరోల్లో శోభన్ బాబే నంబర్ 1 ఆస్తి పరుడు అని మురళీ మోహన్ అప్పట్లో చెప్పాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos