కోల్కతా: భారతీయ జనతా పార్టీకి కిసాన్ మోర్చా హూగ్లీ జిల్లా కార్యదర్శి స్వరాజ్ ఘోష్, టాలీవడు్ నటులు పాయెల్ దేయ్, రెజ్వాన్ రబ్బానీ షైక్, ప్రియా పాల్లు రాష్ట్ర మంత్రి, టీఎంసీ నేత పార్తా చటర్జీ ఆధ్వర్యంలోమంగళ వారం ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మున్నె న్నడూ లేనంత ఎక్కువగా సినీ తారలు, ప్రముఖులు ఈ దఫా బెంగాల్ ఎన్నికల బరిలో దిగారు. నువ్వా నేనా అన్నట్లు పోరాడుతున్న టీఎంసీ, బీజేపీ వారిని చేర్చుకునేందుకు, టిక్కెట్లిచ్చేందుకు పోటీపడ్డాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 29 మధ్య ఎనిమిది దశల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 2న విడుదల కానున్నాయి.