హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్పైన జరిగిన దాడిని ఆత్మ గౌవర దాడిగా పరిగణిస్తామని టీజేఎస్ అధినేత కోదండరాం, కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈటలతో భేటీ అయిన తర్వాత వారిద్దరూ విలేఖరులతో మాట్లాడారు. ‘ఈటల విషయంలో ఐక్య వేదిక నిర్మాణం చేయాలనే ఆలోచనలో సమావేశం అయ్యాం. ఈటల కుటుంబంపై కేసీఆర్ రాజకీయ కక్షలకు దిగుతున్నారు. ఒకవేళ ఈటల రాజేందర్ నిజంగా తప్పు చేసి ఉంటే పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయడం లేదు? లేక అనర్హుడిగా ఎందుకు ప్రకటించడం లేదు? ఇవేవీ చేయడానికి కేసీఆర్ ధైర్యం లేదా? ఈటెలకు ఈ విషయంలో మద్దతుగా నిలుస్తామ’ని వివరించారు.