న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళబోనని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ గురువారం ఇక్కడ ఒక వార్తా సంస్థతో మాట్లా డారు. ఎవరైనా తనను బయటికి తోసేస్తే మినహా, తాను పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. పార్టీలో తాను కౌలుదారును కాదని, భాగస్వామినని చెప్పారు. తాను 40 ఏళ్ళ పాటు పార్టీ కోసం కృషి చేశానని చెప్పారు. ఈ దేశ ఐకమత్యం కోసం తన కుటుంబం రక్తం చిందించిందన్నారు. తనను ఎవరైనా బయటకు పంపించేయాలనుకుంటే, అది విభిన్నమైన విషయమని చెప్పారు. మనీశ్ తివారీ కాంగ్రెస్కు రాజీనామా చేయబోతున్నారనే ఊహాగానాల గొంతు విప్పారు.‘కాంగ్రెస్లో నేను కౌలుదారును కాదు, నేను భాగస్వామిని. నేను పార్టీకి 40 ఏళ్ళు ఇచ్చాను. ఈ దేశ ఐకమత్యం కోసం మా కుటుంబం రక్తం చిందించింది. కానీ ఎవరైనా నన్ను బయటకు తోసేయాలనుకుంటే, అది వేరే విషయం’’ అన్నారు.మనీశ్ తివారీ పంజాబ్లోని శ్రీ ఆనంద్పూర్ సాహిబ్ నియోజకవర్గానికి లోక్సభలో ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఈ నెల 20న జరుగుతాయి. బుధవారం ఆయన ఇచ్చిన ట్వీట్లో, ‘‘నేను మాట్లాడితే తిరుగుబాటుగా భావిస్తారు. నేను మౌనంగా ఉంటే, నిస్సహాయుడినయ్యానంటారు’’ అని పేర్కొ న్నారు.కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలంటూ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో మనీశ్ తివారీ కూడా ఉన్నారు.