సుపథం ద్వారా స్వామి దర్శనం

సుపథం ద్వారా స్వామి దర్శనం

తిరుమల: ఆన్ లైన్ మాధ్యమంగా కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు స్వామి వారి దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తామని తితిదే ప్రకటించింది. ఆన్ లైన్ లో కల్యాణోత్సవం సేవ చేసిన భక్తులు భక్తులు తమకు స్వామి వారి దర్శనం కల్పించాలని చేసిన వినతికి తితిదే సానుకూలంగా స్పందించింది. ఈ నెల 7వ తేదీ వరకూ మొత్తం 8,330 మంది భక్తులు ఆన్ లైన్ మాధ్యమంగా కల్యాణోత్సవాన్ని జరిపించారు. వీరందరికీ ఉత్తరీయం, రవిక, కల్యాణం అక్షింతలు, కలకండ ప్రసాదాన్ని తపాలా శాఖ ద్వారా పంపారు. కల్యాణోత్సవం చేయించిన భక్తులు టికెట్ బుక్ చేసుకున్న రోజు నుంచి 90 రోజుల్లోగా సుపథం ప్రవేశమార్గం ద్వారా ఉచితంగా స్వామి దర్శనాన్ని కల్పిస్తామని ప్రకటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos