న్యూ ఢిల్లీ : తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ రాజకుటుంబానిదేనని న్యామూర్తి యు.యు.లలిత్ సారథ్యంలోని ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది. కొత్త సమితి ఏర్పాటయ్యేవరకూ ఆలయ నిర్వహన బాధ్యతల్ని తిరువనంతపురం జిల్లా న్యాయమూర్తి నేతృత్వంలో సమితి చేపడు తుందని పేర్కొంది. ఆ ఆలయ సంపదలు, నిర్వహణ బాధ్యతలను ట్రావెన్ కోర్ రాజవంశం నుంచి స్వాధీనం చేసుకోవాలని 2011 జనవరి 31న కేరళ ఉన్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును ట్రావెన్ కోర్ రాజవంశీయులు అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేసారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేసిన న్యాస్తానం నిరుడు ఏప్రిల్లో తీర్పును వాయిదా వేసింది. 2011లో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున సంపదలు బయటపడిన విషయం తెలిసిందే.