రైతులపై కాదు కరోనాతో పోరాడండి

రైతులపై కాదు కరోనాతో పోరాడండి

న్యూ ఢిల్లీ : తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న అన్నదాతలకు వ్యతిరేకంగా కాదు.. కరోనాకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా కేంద్రాన్ని కోరింది. ‘నల్ల చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్లు నెరవేరితేనే రైతులు ఆందోళనను విరమిస్తారు. రైతులు ఆందోళన చేపడుతున్న ప్రాంతాల్లో టీకా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అలాగే వైరస్ నుంచి భద్రత కోసం అవసరమైన చర్యల్ని తీసుకోవాలి. రైతులు, వలస కార్మికులను కేంద్రం ఆదుకోవాలి. గతేడాది లాక్డౌన్ సమయంలో వారిని విస్మరించింది. దీంతో తమ సొంత ప్రాంతాలకు చేరుకునే సమయంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే కేంద్రం మొండి వైఖరి వల్ల సుమారు 375 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో అయినా మరే ప్రాంతంలోనైనా నల్ల చట్టాలను రద్దు చేసినపుడే రైతులు ఆందోళనలు విరమిస్తారు. అప్పటి దాకా విశ్రమించరు. ఒకవేళ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ ఉండి ఉంటే వారి డిమాండ్ల సాధనకు ముందుకు రావాలి’అని సంయుక్త కిసాన్ మోర్చా ఒక ప్రకటనను విడుదల చేసింది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos