11 నుంచి 3 గంటల వరకే భారత్ బంద్

న్యూ ఢిల్లీ : భారత్ బంద్- అందోళనను మంగళవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ ప్రకటించారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘మా బంద్ సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. బంద్ను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తాం. తమ తమ విధుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లే వారు నిరభ్యంతరంగా వెళ్లవచ్చు. ఆ తర్వాత 3 గంటలకు బంద్ను ముగిస్తాం. ఆ సమయంలో కార్యాలయాలు కూడా ముగుస్తాయి. అత్యవసర సర్వీసులైన అంబులెన్స్లు, పెళ్లిళ్లు యథావిథిగానే జరుగుతాయి. మా నిరసనను శాంతియుతంగా కొనసాగిస్తాం. నిరసన వ్యక్తం చేయడానికి ఈ విధానాన్ని ఎంచుకున్నాం.నూతన వ్యవసాయ చట్టాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమన్న సంకేతాలను ఇవ్వడానికే దీనిని నిర్వహిస్తున్నామ’ని టికాయత్ వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos