ముగ్గురు ఉగ్రవాదుల హతం

ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూ: షోఫియాన్ జిల్లా తుర్కువాంగన్ గ్రామంలో మంగళ వారం జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్ర వాదులు హత మయ్యారు. ఉగ్రవాదుల కోసం రాష్ట్రీయరైఫిల్స్, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు తెల్లవారు జామున గాలిస్తున్నపుడు ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు. దీంతో ఎదురు కాల్పులు సంభవించాయి. దరిమిలా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. హతుల నుంచి ఏకే-47, ఇన్సాస్ రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos