అమరావతి: రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,730 నమూనాల్ని పరీక్షించి మరో 33 మందికి కరోనా సోకినట్లు గుర్తించామని వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం ఇక్కడ ప్రకటించింది. మొత్తం కరోనా పీడితుల సంఖ్య 2,051. ఆసుపత్రుల్లో 949 మంది చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు కోలుకుని విడుదలయ్యారు. గత24 గంటల్లో 58 మంది కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు చేరారు.