స్టైలిష్‌స్టార్
అల్లు అర్జున్‌తో నటించిన డీజే చిత్రం అనంతరం వచ్చిన క్రేజ్‌తో క్రేజీ సినిమాల్లో అవకాశాలు
దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ రేసులో ఉన్న పూజా హెగ్డే కారు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో
పట్టుబడ్డట్లు తెలుస్తోంది.మహర్షి ప్రీ రిలీజ్ వేడుక ముగిసిన అనంతరం స్నేహితులతో కలసి
ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో పార్టీ చేసుకోవడానికి పూజా కారులో బయలుదేరారు. మధ్యలో పోలీసులు
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా అటుగా వచ్చిన పూజా కారును కూడా ఆపిన పోలీసులు
కారు నడుపుతున్న మేనేజర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం తాగినట్లు తేలడంతో
పోలీసులు మేనేజర్ లైసెన్స్‌తో పాటు కారును కూడా సీజ్ చేశారు.దీంతో అప్పటికప్పుడు
మరో కారు తెప్పించుకున్న పూజా తన స్నేహితులతో కలసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.అయితే
మద్యం తాగి కారు నడపకపోయినా మద్యం తాగి వాహనం నడుపుతున్నా వారించకుండా పూజా డ్రంక్
అండ్ డ్రైవ్‌ను ప్రోత్సహించిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.