లలితా జ్యువెలర్స్‌లో రూ.50 కోట్ల ఆభరణాల చోరీ

  • In Crime
  • October 2, 2019
  • 190 Views
లలితా జ్యువెలర్స్‌లో రూ.50 కోట్ల ఆభరణాల చోరీ

చెన్నై : తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న లలితా జ్యువెలరీస్ దుకాణంలో భారీ దొంగతనం జరిగింది. బుధవారం తెల్లవారు జామున దుకాణం గోడకు పెద్ద రంధ్రం చేసిన దొంగలు లోనికి చొరబడ్డారు. సుమారు 35 కిలోల బంగారం, వజ్రాభరణాలు దోచుకెళ్లారు. అపహరణకు గురైన వజ్రాభరణాల ధర సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. ముసుగు ధరించి దుకాణంలోకి చొరబడిన ఇద్దరు దుండగులు ఆభరణాలు చోరీ చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. సమాచారం అందుకున్న తిరుచ్చి పోలీసులు నగల దుకాణాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos