అంతకంటే ఇంకేం చేయగలరు?

అంతకంటే ఇంకేం చేయగలరు?

దొంగలు పడ్డ
ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు వరుసగా తమ ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతుంటే చేష్టలుడిగి
చూస్తుండిపోయిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో
ఆందోళనలు చేయడానికి నిర్ణయించుకున్నారు.కాంగ్రెస్‌ గుర్తుపై ఎన్నికల్లో గెలిచి అనంతరం
తెరాసలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేసి
ఆందోళనలు చేయడానికి కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలో ఇటీవల తెరాసలో చేరిన
ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ నాయక్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతలు కామెపల్లి
మండంలో కొత్తలింగాల గ్రామంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఎదుట హరిప్రియ దిష్టిబొమ్మను
దహనం చేసి నిరసనలు తెలిపారు.కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచి తెరాసలో చేరిన హరిప్రియ వెంటనే
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెరాస బీఫారమ్‌పై పోటీ చేయాలంటూ డిమాండ్‌ చేశారు.తమ
పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి తెరాస మత పార్టీలో చేర్చుకుంటున్నారంటూ కాంగ్రెస్‌
నేతలు ఆరోపించారు.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేయడం
మినహా కాంగ్రెస్‌ నేతలు ఇంకేం చేయలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.మరో కాంగ్రెస్‌
సీనియర్‌ మహిళ నేత,ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి కూడా కొడుకు కార్తిక్‌రెడ్డితో పాటు
తెరాసలో చేరడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos