నేనూ భారత మాత బిడ్డను

నేనూ భారత మాత బిడ్డను

న్యూఢిల్లీ : ‘నేను ఈ భూమి బిడ్డనే… చివరికి నా పిల్లి కూడా భారతీయురాలే..’ అని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ప్రకటించారు. భారత్లో ఇంకో ఏడాది పాటు జీవించటానికి కేంద్రం అనుమతి పొడగించిన దశలో ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం లేక ఇక్కడే శాశ్వతంగా నివసించడానికి కేంద్రం అవకాశమివ్వాలని కోరారు. ప్రతీ ఏటా పొడగింపు ఉంటుందో, ఉండదనే భీతి పీడిస్తోంది. ఇది తన రచనల్ని ప్రభావితం చేస్తోందని ఆవేదన చెందారు. ‘భారత్ నా ఇల్లు. శాశ్వతంగా ఉండేందుకు అనుమతించి ప్రతీ ఏటా చింతించే అవకాశాన్ని కల్పించరాదని’ విన్నవించారు. రాజ్నాథ్ సింగ్ హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలోనే ఆయన్ను కలుసుకుని జీవితాంతం భారత్లోనే నివసిస్తానని విన్నవించినట్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos