న్యూఢిల్లీ : పుల్వామా విషయంలో కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరమేమీ లేదని ఎంపీ శశి థరూర్ ట్విట్టర్ లో ప్రకటించారు. ‘‘కాంగ్రెస్ ఎందుకు క్షమాపణలు చెప్పాలో నేను ఇప్పటికీ ఆలోచిస్తున్నా. ప్రభుత్వం సైనికులను సురక్షితంగా ఉంచుతుందని ఆశించినందుకా? విషాదాన్ని రాజకీయం చేయవద్దని డిమాండ్ చేసినందుకా? లేదా అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలిపినందుకా? ఎందుకు?’అని ప్రశ్నిం చారు. పుల్వామా ఉగ్రదాడి వెనుక తామే ఉన్నట్లు పాక్ ప్రకటించింది. కుట్ర సిద్ధాంతమంటూ లేనిపోని ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇతర పక్షాలు జాతికి వెంటనే క్షమా పణలు చెప్పాలి.’’ అని ట్విట్టర్ వేదికగా జావదేకర్ డిమాండ్ చేశారు.