తిరువనంతపురం: ప్రధాని మోదీని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు తాను బీజేపీలో చేరుతున్నాననడానికి సంకేతాలు కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాలను మెచ్చుకుంటూ ఆయన ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో భాజపాలో చేరనున్నారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ ప్రచారంపై థరూర్ తాజాగా స్పందిస్తూ తన వైఖరిని స్పష్టం చేశారు.