ఇస్లామాబాద్: జమ్ము-కశ్మీర్ పరిణామాల వల్ల పాకిస్థాన్-భారత్ మధ్య నడిచే థార్ ఎక్స్ప్రెస్ సేవలపై వేటు పడింది. ఇది భారత్, పాకిస్థాన్ను అనుసంధానం చేసే చివరి రైలు లింక్. ‘థార్ ఎక్స్ప్రెస్ సేవలను కూడా నిలిపివేయాలని మేం నిర్ణయించుకున్నాం. నేను రైల్వే మంత్రిగా ఉన్నంత కాలం భారత్, పాకిస్థాన్ మధ్య ఏ రైలు నడవదు’ అని పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ వెల్లడించినట్లు ఒక వార్తా సంస్థ ప్రకటించింది. భారత్లోని మొనాబావో, పాకిస్థాన్లోని ఖోక్రపార్ పట్టణాల మధ్య ఈ రైలు నడుస్తోంది.