దర్బార్‌ ఫీవర్‌..

  • In Film
  • January 9, 2020
  • 154 Views
దర్బార్‌ ఫీవర్‌..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొత్త చిత్రం విడుదలవుతుందంటే చాలు తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంటుంది.థియేటర్ల వద్ద అభిమానుల సందడి,కోలాహలం మామూలుగా ఉండదు.రజనీ చిత్రం చూడడానికి దేన్నీ లెక్క చేయకుండా విడుదలకు ముందురోజు రాత్రి నుంచే థియేటర్ల వద్ద నిల్చుంటారు.ఇక సంక్రాంతి సందర్భంగా రజనీ కొత్త చిత్రం దర్బార్‌ విడుదల నేపథ్యంలో తమిళనాడులో అభిమానుల సందడికి అవధులు లేకుండాపోయాయి. సినిమా విడుదలైన తేదీ నుంచి అయిదు రోజుల పాటు ఆరు షోలను ప్రదర్శించడానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.దీంతో అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకే సినిమాను ప్రదర్శించారు థియేటర్ల యాజమానులు. ఈ షో కోసం వందలాది మంది అభిమానులు అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద బారులు తీరి కనిపించారు. దర్బార్ సినిమాను ప్రదర్శిస్తోన్న థియేటర్లన్నీ పెళ్లికూతుళ్లలా ముస్తాబయ్యాయి.విద్యుద్దీపాలతో థియేటర్లను అలంకరించారు. రజినీకాంత్ బొమ్మలను ముద్రించిన జెండాలు కట్టారు. ఇక బ్యానర్లు, ఫ్లెక్సీలకు లెక్కే లేదు. అభిమానుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని దర్బార్ సినిమా థియేటర్ల వద్ద పోలీసుల భద్రతను మోహరింపజేశారు. ఒకట్రెండు ప్రాంతాల్లో థియేటర్ల వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది.

మహిళ అభిమానుల పూజలు..

 

చెన్నైలో దాదాపు ప్రతి థియేటర్‌లోనూ ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.రజినీ సినిమా విడుదలవుతోందంటే జపాన్‌ నుంచి చెన్నైకి దిగే బ్యాచ్‌ ఒకటి దర్బార్‌ చిత్రం కోసం కూడా దిగింది.జపాన్‌ నుంచి వచ్చిన రజినీ అభిమానులు వారితో సెల్ఫీ తీసుకున్నారు.సినిమా హిట్ కావాలంటూ కొంతమంది మహిళ అభిమానులు పూజలు, పునస్కారాలు చేయడం గమనార్హం.థియేటర్ల వద్ద మంగళ వాయిద్యాలను మోగిస్తూ, రజినీ స్టైల్లో స్టెప్పులు వేస్తూ అలరించారు. తమిళనాడు మొత్తంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos