ముంబై: కోవిడ్ వ్యాప్తిని నిరోధానికి సామాజిక, రాజకీయ, మత పరమైన కార్యక్రమాల్లో జనం ఒకేచోట గమి గూడకుండా జాతీయ విధానాన్ని తీసుకురావాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కోరారు. మోదీ శుక్రవారం జరిపిన వర్చువల్ సమావేశంలో థాకరే ఈ వినతి చేశారు. కోవిడ్ మహమ్మారిపై ప్రభుత్వం పోరాటం సాగిస్తు న్నప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో జనం గుమిగూడటం సవాలుగా మారిందని ఆక్రోశించారు. సామాజిక రాజకీయ, మతపరమైన కార్యక్రమాల్లో జనం గుమిగూడకుండా నిరో ధిం చేందుకు ఒక జాతీయ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనే వ్యూహ రచన చేస్తున్నామన్నారు.