ముంబై: ‘ప్రజా తీర్పును అవమానించారని మాపై భాజపా ఆరోపణలు చేస్తోంది. భాజపాయే ప్రజల్ని మోసం చేసి, ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంద’ని శనివారం ఇక్కడ శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. పాక్ పై జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ తరహాలో మహారాష్ట్ర ప్రజలపై మెరుపు దాడి చేశారని, ప్రజలే భాజపపై ప్రతీకారాన్ని తీర్చుకుంటారని వ్యాఖ్యా నించా రు. ‘శివసేన ఎమ్మెల్యేల్లో కూడా చీలిక తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోందా? ప్రయత్నించనివ్వండి.. మహారాష్ట్ర ప్రజలు హాయిగా నిద్రపోకుండా చేస్తోందా? చేసుకోనివ్వండి. వారి ప్రయత్నాలన్నింటినీ తిప్పికొడతాం. అప్పట్లో తనను వెన్నుపోటు పొడవాలని చూసిన వారితో ఛత్రపతి శివాజీ ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు. ఇంతకు ముందు భాజపా ఈవీఎంలతో ఆట ఆడింది. ఇప్పుడు కొత్త ఆట మొదలు పెట్టింద’ని మండి పడ్డారు.