దేశంలోనే ప్రభావవంతమైన మహారాష్ట్రను పాలించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తానని కలలో కూడా ఊహించుకోలేదు. ఇలాంటి హోదాను చేపట్టడానికి కారణమైన సోనియా గాంధీ, ఇతర నేతలకు ధన్యవాదాలు అని ఉద్దవ్ థాకరే అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు నెలకొన్న క్లిష్టమైన సమయంలో ఇలాంటి అవకాశం రావడం ఛాలెంజ్గా ఉంది అని ఆయన తెలిపారు.అసెంబ్లీలో ఓ పక్క ఎమ్మెల్యేల ప్రమాణం స్వీకారం జరుగుతుండగానే శివసేన అధినేత ఉద్దవ్ థాకరే భార్య రష్మీతో కలిసి రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ కోష్యారీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.