బీజింగ్ :పంటల దిగుబడి పెంచేందుకు చేసే మట్టి నాణ్యత పరీక్షకు కృత్రిమ మేధను శాస్త్రవేత్తలు సృష్టించారు. ‘ఫ్యూసేరియం విల్ట్ వంటి వ్యాధులు నేల ద్వారా మొక్కలకు వ్యాపించాయి. ఇది వ్యవసాయంలో భారీ నష్టాలకు దారి తీసింది. మట్టిలో వున్న వ్యాధి అంచనా కోసం నూతన కృత్రిమ మేధ సహాయపడుతుందని పరిశోధకులు చెప్పారు. నాన్జింగ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఫ్యూసేరియం విల్ట్కు సంబంధించిన 1,500కి పైగా మట్టి నమూనాలను విశ్లేషించారు. అనారోగ్యకరంగా వున్న మట్టిలో సూక్ష్మజీవుల కూర్పును విశ్లేషించడానికి, ఆ మట్టిలోని బ్యాక్టీరియా, శిలీంధ్ర నమూనాలను ఉత్పత్తి చేయడానికి వారు ఎఐ విధానాన్ని ఉపయోగించారు. ఇది 85 శాతం కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో నాణ్యతను అంచనా వేస్తందన్నారు.