కేవలం ఒక గంటలో కరోనా పరీక్ష

కేవలం ఒక గంటలో కరోనా పరీక్ష

న్యూ ఢిల్లీ : కేవలం ఒక గంట వ్యవధిలోనే కచ్చితమైన ఫలితాలనిచ్చే కరోనా పరీక్ష మరో నాలుగు వారాల్లో అందుబాటులోకి రానుంది. ఫెలూదా అనే ఈ పరీక్షా విధానం ఖర్చు సుమారు రూ.500లు. ఇక్కడి కౌన్పిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (సీఎస్ఐఆర్-ఐజీఆర్బీ)లో సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ దేబొజ్యోతి చక్రవర్తి, డాక్టర్ సౌవిక్ మైతీ దీన్ని కనిపెట్టారు. ఫెలూదా విధానంలో వ్యాధి కారక సార్స్-సీఓవీ2 వైరస్ జన్యు నిర్మాణాన్ని కనుగొని నిర్మూలించేందుకు సీఆర్ఐఎస్పీఆర్ జీన్ ఎడిటింగ్ సాంకేతికతను ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఈ సాంకేతికతను ఉపయోగించే కరోనా పరీక్షా విధానం దేశంలో ఇదొక్కటే అని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos