కాబూల్: నిత్యం బాంబు పేలుళ్లు, ఉగ్రదాడులతో అట్టుడుకిపోతున్న అఫ్గానిస్థాన్లో గత 24 గంటల్లోనే 100 మందికి పైగా ఉగ్ర వాదులను హతమార్చినట్లు ఆ దేశ రక్షణ శాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 15 ప్రాంతాల్లో 18 దాడులు చేసి 109 మంది ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మరో 45 మంది ముష్కరులు గాయపడ్డారు. మరో ఐదు గురిని భద్రతా దళాలు అరెస్టు చేసాయి. కపిసా ప్రావిన్స్లోని నిజ్రాబ్ జిల్లాలో పదాతి దళం జరిపిన దాడుల్లో తొమ్మిది మంది తాలి బన్లు హతమయ్యారు. నాలుగు ప్రధాన ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి.