దాడులకు మునివేళ్లపై నిలబడిన ఉగ్రవాదులు

దాడులకు మునివేళ్లపై నిలబడిన ఉగ్రవాదులు

న్యూ ఢిల్లీ: నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్థాన్ తిరిగి దాదాపు 18 ఉగ్రశిబిరాలు, 20 లాంఛ్ ప్యాడ్లను తిరిగి ప్రారంభించినట్లు నిఘా వర్గాలు భద్రతా బలగాలకు తెలిపాయి. ఒక్కో శిబిరంలో సాయుధులైన 60 మంది ఉగ్రవాదులున్నట్లు అంచనా.లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్కు చెందిన నేతలు ఇటీవల పుల్వామాలో సమావేశమై వివిధ ప్రాంతాల్లో భారీ దాడుల ప్రణాళిక గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. లోయలో 290-300 మంది ఉగ్రవాదులున్నారని ఆ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ డీజీపీ దిల్బాగ్ సింగ్ ఇది వరకే ప్రకటించారు. సరిహద్దుల్లో చొరబాట్లు విపరీతంగా పెరిగాయని ఆయన తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos