పాక్‌లో కటకటాల వెనక్కు ఉగ్రవాదులు

పాక్‌లో కటకటాల వెనక్కు ఉగ్రవాదులు

ఇస్లామాబాద్ : అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో పాకిస్తాన్లో ఉగ్రవాదులను అరెస్టు చేస్తున్నారు. నిషిద్ధ ఉగ్రవాద సంస్థలకు చెందిన 44 మందిని అరెస్టు చేసినట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది. వారిలో జైష్ ఎ మహ్మద్ వ్యవస్థాపకుడు, మసూద్ అజార్ సోదరుడు ముఫ్తీ అబ్దుర్ రౌఫ్ కూడా ఉన్నట్లు పాక్ మంత్రి షహర్యార్ ఖాన్ వెల్లడించారు. పుల్వమాలో జైష్ జరిపిన దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించగా, ఈ దాడికి సంబంధించిన వివరణ పత్రాన్ని భారత్ తమకు అందజేసిందని చెప్పారు. తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని, ఉగ్ర సంస్థలపై తప్పక చర్యలు తీసుకుంటామని ఆయన వివరణ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos