అజహరుద్దిన్ కొడుకుతో పీకల్లోతు ప్రేమలో సానియా మిర్జా సోదరి..

View this post on Instagram

☀️

A post shared by Asad (@asad_ab18) on

భారత క్రికెట్‌
జట్టు మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దిన్‌ కుమారుడు టెన్నిస్‌స్టార్‌ సానియా మిర్జా
సోదరిని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అజహరుద్దిన్‌ కుమారుడు
అసదుద్దిన్‌,సానియామిర్జా సొందరి ఆనమ్‌ మిర్జాలు కొద్ది కాలంగా ప్రేమలో మునిగి తేలుసుతున్నట్లు
వార్తలు వినిపిస్తున్నాయి.ఇద్దరు కలసి కొద్ది రోజుల క్రితం దుబయ్‌లో షాపింగ్‌ చేసిన
ఫోటోలను ఇరువురు తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో పోస్ట్‌ చేయడం ఫోటోల్లో ఇరువురు ఎంతో
సన్నిహితంగా మెలుగుతుండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.అయితే ఇరువురి కుటుంబ సభ్యులు
మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు.కాగా ఆనమ్‌ మిర్జాకు రెండేళ్ల క్రితం అక్బర్‌
రషీద్‌తో హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.అయితే
వ్యక్తిగత కారణాల వల్ల రషీద్‌ నుంచి విడాకులు కావాలంటూ ఆనమ్‌ మిర్జా గత ఏడాది కోర్టుకు
దరఖాస్తు చేసుకుంది.ఆనమ్‌ వాదనలతో ఏకీభవించిన కోర్టు విడాకులు మంజూరు చేసిందని విడాకులు
వచ్చినప్పటి నుంచి అసదుద్దిన్‌,ఆనమ్‌లు సన్నిహితంగా మెలుగుతున్నట్లు సమాచారం.ఈ ఏడాది
చివర్లో అసదుద్దిన్‌,ఆనమ్‌ మిర్జాలు వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.మహ్మద్ అజహరుద్దీన్‌కు ఇద్దరు కుమారులు కాగా,
ఒకరు ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన బైక్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos