ముంబై: కరోనా వైరస్ ప్రభావంతో మహారాష్ట్రలోని పలు ఆలయాలు మూతపడ్డాయి. ముంబైలోని అతి ప్రాచీన సిద్ధివినాయక ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ట్రస్టు ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకూ గుడి తలుపులు మూసే ఉంటాయని పేర్కొంది. మహారాష్ట్రలోని మరో ప్రముఖ ఆలయం తుల్జా భవాని ఆలయంలో మార్చి 17 నుంచి 31 వరకూ ఎవరికీ ప్రవేశం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఈ రెండు ఆలయాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో జన సమూహాలను నివారించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 37 కరోనా కేసులు నమోదయ్యాయి.